Supreme Court Judge Justice Srinarasimha: నృసింహుని సేవలో జస్టిస్ శ్రీనరసింహ
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:02 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ శనివారం సతీసమేతంగా గుంటూరు జిల్లాలోని మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించారు.
మంగళగిరి సిటీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ శనివారం సతీసమేతంగా గుంటూరు జిల్లాలోని మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించారు. దిగువ సన్నిధిలో లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎగువ సన్నిధిలో పానకాల నృసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.