Share News

ఓఎంసీ అక్రమాలపై నివేదికకు గడువు పెంపు

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:37 AM

ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దుల్లోని ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమ మైనింగ్‌, అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలపై...

ఓఎంసీ అక్రమాలపై నివేదికకు గడువు పెంపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దుల్లోని ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమ మైనింగ్‌, అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి కమిటీకి సుప్రీంకోర్టు మరో ఆరువారాల గడువు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పిస్తారనే నమ్మకంతోనే గడువును పెంచుతున్నామని, ఆ నివేదిక వచ్చాకే తదుపరి ఆదేశాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సీజేఐ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Feb 25 , 2026 | 03:39 AM