Share News

రేపటిలోగా లొంగిపోండి

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:38 AM

మద్యం కుంభకోణం కేసులో కీలకంగా భావిస్తున్న ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

రేపటిలోగా లొంగిపోండి

  • మద్యం కేసులో ముప్పిడి అవినాశ్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో కీలకంగా భావిస్తున్న ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 26వ తేదీలోగా లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్‌ బెయిల్‌ కోసం అభ్యర్థించాలని చీఫ్‌జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం తేల్చి చెప్పింది. ముప్పిడి అవినాశ్‌ రెడ్డి (ఏ7) ద్వారానే మద్యం స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డి అక్రమ కార్యకలాపాలు జరిపారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అవినాశ్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు తెలుస్తాయని దర్యాప్తు సంస్థ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సుప్రీంకోర్టు.. ముందు లొంగిపోవాలని అవినాశ్‌ రెడ్డిని ఆదేశించింది.

Updated Date - Feb 25 , 2026 | 04:39 AM