Share News

ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తుల హోదా

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:26 AM

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తుల హోదా
SUPREMECOURT

  • సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తరువాత వీరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు.

వీరిలో కుంచెం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్‌, చల్లా గుణరంజన్‌ ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2024 అక్టోబరు 28న ప్రమాణం చేశారు. అలాగే జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

Updated Date - Sep 24 , 2026 | 06:30 AM