Share News

Permanent Building: శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించిన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల బృందం

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:35 AM

అమరావతి రాజధానిలో నిర్మాణం జరుగుతున్న శాశ్వత హైకోర్టు భవనం, న్యాయమూర్తుల నివాస కట్టడాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి...

Permanent Building: శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించిన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల బృందం

గుంటూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో నిర్మాణం జరుగుతున్న శాశ్వత హైకోర్టు భవనం, న్యాయమూర్తుల నివాస కట్టడాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిగంటం శ్రీ నరసింహ పరిశీలించారు. శుక్రవారం అమరావతి రాజధాని సందర్శనకు వచ్చిన ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన రావుతో కలసి భవనాలను చూశారు. ఈ సందర్భంగా ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు హైకోర్టు నిర్మాణ పురోగతి, న్యాయమూర్తుల క్వార్టర్స్‌ నిర్మాణాల గురించి వివరించారు. పిచ్చుకలపాలెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డిజైన్‌లను కూడా చూపించారు. నిర్మాణ పనులపై జడ్జీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 03 , 2026 | 06:35 AM