Share News

అన్నదాతకు మద్దతు

ABN , Publish Date - May 14 , 2026 | 12:10 AM

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) పెంచుతూ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

   అన్నదాతకు మద్దతు

తెల్లబంగారం పత్తి క్వింటా రూ.8,667

వేరుశనగ రూ.7,517, వరి ధాన్యం రూ.2,461

మొక్కజొన్న రూ.2,410, జొన్నలు రూ.4,073

14 ఉత్పత్తులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

2026-27 ఖరీఫ్‌ సీజనలో అమలు

కర్నూలు, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) పెంచుతూ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన పంటలైన తెల్లబంగారం పత్తి, వరి, పప్పుధాన్యలు, నూనెగింజలు సహా 14రకాల పంటలకు మద్దతు ధరలను పెంచారు. 2026-27 ఖరీఫ్‌ సీజనకు ఈధరలు వర్తిస్తాయి. గతేడాది ఎంఎ్‌సపీతో పోలిస్తే. క్వింటాపై పత్తి, రూ.557, వేరుశనగ రూ.254, వరి ధాన్యం రూ.72, జొన్నలు రూ.324 పెరిగాయి. అన్నదాతలకు కేంద్రం ‘మద్దతు’గా నిలిచిందని అధికార పక్షం నాయకులు పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ధరలు భారీగా పెరిగాయి. ఆ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు పెంచలేకపోయారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన ప్రారంభానికి ముందే కనీస మద్దతు ధర ప్రకటించడంతో లాభదాయకమైన పంటలు సాగు చేసుకోవడానికి రైతులకు వెసులుబాటు కలుగుతుంది.

రైతుల్లో హర్షం

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మిపర అధికంగా సాగు చేస్తే.. నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్నలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. 2026-27 ఖరీ్‌ఫలో కర్నూలు జిల్లాలో 4,22.550 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2,10,475 హెక్టార్లు కలిపి 6,33,025 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూన 15 నుంచి ఖరీఫ్‌ సీజన ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని పొలాలు సాగు సన్న ద్ధం చేస్తున్నారు. బోరుబావుల కింద పత్తి సాగు చేపట్టారు. ప్రతి ఏటాలాగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ సీజనకు ఉందే కనీస మద్దతు ధర పెంచడంపై రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

పెట్టుబడులకు అనుగుణంగా..

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలపై అన్నదాతల్లో ఆశ.. నిరాశలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచలేదనే పలువురు రైతులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 3.45 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని అంచనా. ఒక్క కర్నూలు జిల్లాలోనే 2.35 లక్షల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారుల ప్రణాళిక. గతేడాది లాంగ్‌ స్టేబుల్‌ పత్తి క్వింటా మద్దతు ధర రూ.8,110, మీడియం స్టేబుల్‌ పత్తి రూ.7,710 ఉంటే, ఈ ఏడాది రూ.8,667, రూ.8,267 పెంచారు. క్వింటాపై రూ.557 పెరిగింది. 6.9-7.2 శాతం ఎంఎ్‌సపీ పెరగడంతో పత్తి రైతులకు కొంత ఊరట లభిస్తుంది. సాగు ఖర్చులు పెరగడంతో క్వింటా రూ.9వేలు చేసి ఉంటే అన్నదాతకు మరింత లాభసాటిగా ఉంటుందని అంటున్నారు.

రెండేళ్లతో పోలిస్తే..

నంద్యాల జిల్లాలో కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువ.. వంటి సాగునీటి వనరులు ఉన్నాయి. ప్రధానంగా ఖరీ్‌ఫలో 1.65లక్షల ఎకరాల్లో (65,787 హెక్టార్లు) వరి ధాన్యం సాగు చేస్తున్నారు. డీఏపీ, కాంప్లెక్స్‌ రసాయన ఎరువుల ధరలతో పాటు పురుగు మందులు ధరలు భారీగా పెరగడంతో రెండేళ్లతో పోలిస్తే సాగు ఖర్చులు 25-30 శాతానికి పైగా పెరిగాయి. వరి మద్దతు ధర సాధారణ రకం రూ.2,369 నుంచి రూ.2,441కు, గ్రేడ్‌-ఏ రకం రూ.2,389 నుంచి రూ.2,461కు పెంచారు. క్వింటాపై రూ.72లే పెంచారు. అంటే.. కేవలం 3 శాతం మాత్రమే. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎంఎ్‌సపీ ధరలు పరిశీలిస్తే కనిష్ఠంగా 0.1 శాతం, గరిష్ఠంగా 8.6 శాతం పెంచారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంటలైన మొక్కజొన్న, వరి ధాన్యం, వేరుశనగ ఉత్పత్తుల మద్దతు ధరలు ఆశాజనకంగా పెంచలేదని రైతులు అంటున్నారు.

వ్యవసాయ ఉత్పత్తలు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.ల్లో:

-----------------------------------------------------------------------------------

పంటలు 2025-26 2026-27 తేడా శాతం

------------------------------------------------------------------------------------

వరి సాధారణం 2,369 2,441 72 3.0

వరి గ్రేడ్‌-ఏ 2,389 2,461 72 3.0

జొన్నలు 3,749 4,073 324 8.6

సజ్జ 2,775 2,900 125 4.5

మొక్కజొన్న 2,400 2,410 10 0.4

రాగులు 4,886 5,205 319 6.5

కంది పప్పు 8,000 8,450 450 5.6

పెసరపప్పు 8,768 8,780 12 0.1

ఉద్దులు 7,800 8,200 400 5.1

వేరుశనగ 7,263 7,517 254 3.5

సోయబీన 5,328 5,708 380 7.1

నువ్వులు 9,846 10,346 500 5.1

సూర్యకాంతి 7,721 8,343 622 8.1

పత్తి (లాంగ్‌ స్టేపుల్‌) 8,110 8,667 557 6.9

పత్తి(మధ్యస్త స్టేపుల్‌) 7,710 8,267 557 7.2

Updated Date - May 14 , 2026 | 12:10 AM