Share News

రైతులకు దక్కని మద్దతు ధర

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:15 PM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందడం లేదు.

 రైతులకు దక్కని మద్దతు ధర
విక్రయానికి వచ్చిన శనగలు

& నిలిచిన శనగ కొనుగోలు

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందడం లేదు. ఐదు రోజులుగా ఆదోని మార్కెట్‌ యార్డ్‌లోని కేడీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రం వద్ద మద్దతు ధరతో శనగ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా పప్పు శనిగను రైతులు నుంచి క్వింటాలు రూ. 5875 కొనుగోలు చేయాలని సూచించింది. మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు రూ. 5వేలుకు మించి కొనుగోలు చేయడం లేదు. మద్దతు ధరకు విక్రయించుకుందామంటే కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా 8751 బస్తాలు, నాఫెడ్‌ ద్వా రా 19,665బస్తాలు రైతుల నుంచి కొనుగో లు చేశామని డీసీఎంఎస్‌ మేనేజర్‌ శిరీష తెలిపారు. ఽఅధికారులు తాత్కాలికంగా కొనుగోలు నిలుపుదల చేయాలని సూచించారన్నారు. రైతులు కొనుగోలు చేయాలని ప్రతిరోజు వస్తున్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని రెండు రోజుల్లో అనుమతులు వస్తే తిరిగి కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 11:15 PM