Share News

1 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:58 AM

ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రకటించింది.

1 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం

  • ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌కు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ లేఖ

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రకటించింది. ఈమేరకు గురువారం సాయంత్రం ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోకు అసోసియేషన్‌ లేఖ ఇచ్చింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి, ట్రస్ట్‌కు అనేక వినతులు ఇచ్చామన్నారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - Mar 27 , 2026 | 04:58 AM