ముఖ్యమంత్రితో సునీల్ మిట్టల్ భేటీ
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:05 AM
భారతీ ఎంటర్‌పైజ్రెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
డిజిటల్ మౌలిక వసతుల బలోపేతంపై చర్చ
ప్రజలకు మెరుగైన కనెక్టివిటీపైనా..
ఇంటర్నెట్ డెస్క్: భారతీ ఎంటర్‌పైజ్రెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీపై ఫలప్రదమైన చర్చలు జరిగాయని సీఎం తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని (లాస్ట్-మైల్ ఇంటర్నెట్) విస్తరించడం, మొబైల్ టవర్ కనెక్టివిటీని పెంపొందించడంపై చర్చించామన్నారు. రాష్ట్ర డిజిటల్ ప్రగతికి ఈ చర్చలు దోహదపడతాయన్నారు.