DCP KGV Saritha: దృఢ సంకల్పంతో సాగితే విజయం సొంతం
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:25 AM
లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఎంతటి విజయన్ని అయినా సాధించవచ్చని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ కె.జి.వి. సరిత అన్నారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ సరిత
గుంటూరు(విద్య), జనవరి 12 (ఆంధ్రజ్యోతి): లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఎంతటి విజయన్ని అయినా సాధించవచ్చని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ కె.జి.వి. సరిత అన్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు రోజులుగా గుంటూరులో జరుగుతున్న క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సరిత మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమని, ఈ రోజు ఓడినవారు రేపు గెలుస్తారన్నారు. పోటీలో పాల్గొనడమే ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. ఓటమి శాశ్వతం కాదని అది భవిష్యత్తు విజయానికి మార్గం అవుతుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి జాతీయ క్రీడాకారులు అన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.