Share News

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి టేకు రథం

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:28 AM

చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంగళగిరిలో లోకేశ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించాలని మొక్కుకున్న సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు..

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి టేకు రథం

  • మొక్కు చెల్లించుకున్న నిర్మాత అట్లూరి

  • మోపిదేవిలో దేవస్థానానికి అప్పగించిన అట్లూరి, నారా రోహిత్‌

మోపిదేవి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంగళగిరిలో లోకేశ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించాలని మొక్కుకున్న సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు.. అవి నెరవేరడంతో మొక్కు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కోటి రూపాయల వ్యయంతో తయారు చేసిన టేకు రథాన్ని హీరో నారా రోహిత్‌తో కలిసి శనివారం దేవస్థానానికి అప్పగించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచిన సమయంలో తాను స్వామివారికి మొక్కుకున్నానని అట్లూరి చెప్పారు. స్వామి వారికి శాశ్వత రథం లేదని అర్చకులు చెప్పడంతో, రథాన్ని సమకూర్చినట్టు తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మడివరానికి చెందిన రామేశ్వరరావు, శ్రీనివాసరావుల బృందం 23రోజుల్లో ఈ రథాన్ని తయారు చేసింది. శనివారం వేదమంత్రాల నడుమ విశేష అభిషేకాలు నిర్వహించి, రథంపై కలశాన్ని అమర్చి ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అప్పగించారు.

Updated Date - Jan 25 , 2026 | 04:30 AM