Intermediate Education Dept: ప్రీఫైనల్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సన్నద్ధం
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:44 AM
ప్రీఫైనల్ పరీక్ష ఫలితాల ఆధారం గా పబ్లిక్ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసేలా చర్యలు చేపట్టాలని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా...
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రీఫైనల్ పరీక్ష ఫలితాల ఆధారం గా పబ్లిక్ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసేలా చర్యలు చేపట్టాలని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని కార్యాలయం నుంచి డీఐఈవోలు, ఆర్జేడీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల కోసం నిర్వహిస్తున్న ‘సంకల్ప్’ను సమర్థంగా అమలు చేయాలన్నారు.