విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎంపీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:41 PM
విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సూచించారు.
నందికొట్కూరు జనవరి 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సూచించారు. శనివారం పట్టణంలో ఎంపీ శబరి ముందస్తు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జూనియర్ కళాశాలలో క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు అన్న నినాదంతో టోపీలను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించా రు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కళాశాలలో ఏఐఎ్‌ఫడిఎస్, ఏవీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం పోలీ స్ క్వాటర్స్‌లో చిల్డ్రన పార్కు, ఓపెన ఏయిర్ జిమ్ నిర్మాణానికి శం కుస్థాపన చేశారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన డైరెక్టర్ మహేష్ నాయుడు, డీఎస్పీ రామాంజినాయక్, కౌన్సిలర్ చాంద్‌బాష, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, చిన్న వెంకటస్వామి, తమ్మెడపల్లి విక్టర్, సుకూర్ అహ్మద్, బంగారు వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, గోకారి పాల్గొన్నారు.