అసెంబ్లీ సమావేశాలు చూద్దాం రండి!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:52 AM
చట్టసభల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు శాసనసభ సందర్శకుల గ్యాలరీ..
పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆహ్వానం
ఒక్కో బ్యాచ్‌కు 45 నిమిషాలు వీక్షించే అవకాశం
చట్టసభలపై అవగాహన పెంచే ఉద్దేశం
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): చట్టసభల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలను వీక్షించేందుకు అనుమతించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఆసక్తి కల పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపల్స్ విద్యార్థుల జాబితాతో అధికారిక అభ్యర్థన లేఖను ఈ-మెయిల్ ద్వారా legis.passes@gmail.com కు పంపించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపల్స్ సంతకాలు, స్టాంపుతో కూడిన అధికారిక అభ్యర్థన లేఖను, విద్యార్థుల పేరు, ఆధార్ నంబర్ తదితర వివరాలతో కూడిన జాబితాను స్కాన్ చేసి ఈ-మెయిల్ ద్వారా పంపాలన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 45 నిమిషాల వరకు సభా కార్యకలాపాలు వీక్షించే అవకాశం లభిస్తుందని, ప్రతి బ్యాచ్‌లో గరిష్ఠంగా 30 మంది విద్యార్థులను అనుమతిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 91 863 2449184, 91 863 2449185 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.