మెగా డీఎస్సీపై వైసీపీవి తప్పుడు ఆరోపణలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:47 AM
మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థి...
గొడ్డలి పార్టీ నేతలు తక్షణమే క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల హెచ్చరిక
గాంధీనగర్(విజయవాడ), జూన్ 3(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ‘నిరుద్యోగ యువతపై వైసీపీ గొడ్డలి వేటు’ పేరిట బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 16 వేల మంది ఉపాధ్యాయుల ప్రతిష్ఠ, భవిష్యత్తును దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు గొడ్డలి పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడాన్ని జీర్ణించుకోలేని జగన్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. యువగళంలో లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని తెలిపారు. అక్రమాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించి, అర్హులకు నియామక పత్రాలు అందించారన్నారు. సమావేశంలో టీఎన్‌ఎ్‌సఎఫ్ నేత పుల్లగుర చరణ్ యాదవ్, ఆర్‌వైఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి వెంకట గోపి, బీసీ సంఘం నేతలు వై.నాగేశ్వరరావు, నూకానమ్మ, ఎమ్మార్పీఎస్ నేత పేరేల్లి ఎలీషా మాదిగ, దాసరి బుజ్జి పాల్గొన్నారు.