ఫెయిల్ అయ్యానని విద్యార్థిని బలవన్మరణం
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:40 PM
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
పత్తికొండ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మారుతమ్మకు నలుగురు సంతానం. మూడో కూతురు అవంతిక(16) దేవనకొండ జిల్లా పరిషత పాఠశాలలో 10వ తరగతి చదివింది. గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఆమె సైన్స సబ్జెక్టులో 3 మార్కులతో ఫెయిల్ అయ్యింది. మధ్యాహ్న భోజనం అనంతరం కుటుంబ సభ్యులతో నిద్రించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుడిసెలో ఉన్న పైపునకు కూతురు ఉరేసుకొని ఉండటంతో తల్లి గమనించింది. ఆమె కేకలు వేయడంతో బంధువులు అక్కడికి చేరుకొని అవంతికను కిందకు దించారు. అయితే అప్పటికే అమ్మాయి మృతిచెందినట్లు గుర్తించారు. భర్త 13 ఏళ్ల క్రితం మరణించగా మారుతమ్మ కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించు కుంటుంది. ఈఘటనతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.