అయ్యో రాంసాయీ..!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:09 AM
అటు ఇంటర్ పరీక్ష.. ఇటు తండ్రికి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో ఆ విద్యార్థి కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.
ఓ పక్క తండ్రి మృతి.. మరో పక్క ఇంటర్ పరీక్ష
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షకు హాజరు
సంగం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అటు ఇంటర్ పరీక్ష.. ఇటు తండ్రికి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో ఆ విద్యార్థి కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు. అయినా ప్రిన్సిపాల్ ప్రోద్బలంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి, ఆ తర్వాత తండ్రికి అంత్యక్రియలు జరిపాడు. నెల్లూరు జిల్లా సంగంకు చెందిన కందల రాంసాయి జూనియర్ ఇంటర్ చదుతున్నాడు. అతని తండ్రి కందల శివ అలియాస్ శివకృష్ణ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం జూనియర్ ఇంటర్ పరీక్ష రాయాల్సి ఉండగా తండ్రి అంత్యక్రియలకు రాంసాయి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ షేక్ మదార్‌బాషా వెంటనే రాంసాయి కుటుంబసభ్యులతో మాట్లాడి అతన్ని తన బైక్‌పై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.