Agriculture Dept: ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:14 AM
రాష్ట్రంలో రైతులకు ఏవైనా ఎరువుల్ని గరిష్ఠ చిల్లర ధర కన్నా అధికంగా వసూలు చేసినా.. అనవసరమైన ఎరువుల్ని అంటగట్టినా..
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఏవైనా ఎరువుల్ని గరిష్ఠ చిల్లర ధర కన్నా అధికంగా వసూలు చేసినా.. అనవసరమైన ఎరువుల్ని అంటగట్టినా.. మండల వ్యవసాయ అధికారికి లేదా కాల్ సెంటర్ నంబరు 155251కు ఫిర్యాదు చేస్తే.. డీలర్లపై తగిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు. ప్రస్తుతం 45 కిలోల యూరియా బస్తా రూ.266.5, డీఏపీ రూ.1,350 చొప్పున అమ్మాల్సి ఉంటుందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.