Share News

‘స్త్రీ శక్తి’కి పెరుగుతున్న ఆదరణ

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:44 AM

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోన్న ’స్త్రీ శక్తి’తో మహిళా ప్రయాణికుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది.

‘స్త్రీ శక్తి’కి పెరుగుతున్న ఆదరణ

  • మహిళా ప్రయాణికుల సంఖ్య 63 శాతం

  • 92శాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీకి భారీ ఆదాయం

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోన్న ’స్త్రీ శక్తి’తో మహిళా ప్రయాణికుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆక్యుపెన్సీ ఏకంగా 92శాతం దాటింది. గత ఏడాది డిసెంబరు వరకూ రోజుకు సగటున పాతిక లక్షల మహిళా ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చిన ఏపీఎ్‌సఆర్టీసీ ఫిబ్రవరిలో ఆ సంఖ్య 26 లక్షలకు చేరిందని సంస్థ పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రయాణించే పురుషుల సంఖ్య 37శాతం కి పడిపోయింది. స్త్రీ శక్తి పథకం రీయింబర్స్‌మెంటు రూపంలో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.1,714 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ పథకం వల్ల మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరగింది. దీంతో ఉద్యోగం, ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం మొబిలిటీ గణనీయంగా మెరుగు పడిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆదరణకు అనుగుణంగా మరిన్ని బస్సులు ప్రవేశపెట్టి ప్రయాణ సేవల్ని మెరుగు పరుస్తామని అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా పలుచోట్ల మహిళలు బస్సులో లేకున్నా కండక్టర్లు ఉచిత ప్రయాణ టికెట్లు కొడుతున్నారని, ఇన్సెంటివ్‌ల కోసం ఇటువంటి పనులు చేస్తున్న వారిపై తనిఖీల్లో చర్యలు తీసుకొంటున్నామని సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.

Updated Date - Mar 04 , 2026 | 03:45 AM