Share News

రాజకీయ నాటకాలు ఆపండి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:02 PM

రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న నాటకాలను ఆపాలని, కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రాజెక్ట్‌ నిర్మాణాలను గాలికొదిలేసి, మాఫియాలా ప్రవర్తించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు.

   రాజకీయ నాటకాలు ఆపండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

వైసీపీ నేతలు ప్రాజెక్టులను గాలికొదిలేసి కమీషన్లకు కక్కుర్తిపడ్డారు

మాఫియా పనులపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు... మంత్రి ఫరూక్‌

వైసీపీ విమర్శలపై ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్య ధ్వజం

నంద్యాల రూరల్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న నాటకాలను ఆపాలని, కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రాజెక్ట్‌ నిర్మాణాలను గాలికొదిలేసి, మాఫియాలా ప్రవర్తించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు. బుధవారం నంద్యాల టీడీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డి, శ్రీశైలం, నందికొట్కూర్‌ ఎమ్యెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్యలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాల కోసం కృషి చేశారని, వైసీపీ నేతలు ఒక్కరైనా అలాంటి కృషి చేశారా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అలగనూరు కరకట్ట మట్టిని సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. సీఎం రాష్ర్టాభివృద్ధికి పడుతున్న కష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతరెడ్డి విమర్శించిన తీరును ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ నేతలు రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన పనులను 2020 మే 5 వతేదిన 202 జీవోతో రూ 3,825 కోట్లతో పనులు ప్రారంభించారు. అనుమతులు లేవని కేంద్ర జలశక్తి అధికారులు నిలిపివేశారని నాఆ్నరు. అయినప్పటికీ పనులు కొనసాగించడంతో 2021 వసంవత్సరంలో జూలైలో ఎన్జీటీ 2,65 కోట్లు పెనాల్టీ విధించిన సంగతిని వైసీపీ నేతలు మరిచారా అని ప్రశ్నించారు. అనంతరం గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ కల్గిన నేతగా అభివర్ణించారు. గోరుకల్లు రిజర్వాయర్‌ 90 శాతం టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పూరైనట్లు తప్పుడు సమాచారం ఇవ్వడంతో కరకట్టకే ప్రమాదం వాటిల్లిందన్నారు. శాశ్వత కరకట్ట పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి రూ 58 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియా దందాలపై ఉన్న ధ్యాస ప్రాజెక్ట్‌ నిర్మాణాల మీద లేదని వైసీపీ పాలన నిరూపించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం 18 నెలలలో ప్రాజెక్ట్‌ నిర్మాణాలకు రూ6600 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వైసీపీ నాయకులకు ప్రాజెక్ట్‌లపై అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. గిత్తా జయసూర్య మాట్లాడుతూ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వైసీపీ నేతలు రూ 900 కోట్లు దోచుకున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే గుండ్రేవుల ప్రాజెక్ట్‌ చేపడతామని జలదీక్ష చేపట్టిన వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రాయలసీమ ద్రోహి జగన అన్నారు. గతంలో ప్రాజెక్ట్‌ గేట్లకు గ్రీజ్‌కు కూడా నిధులు కేటాయింలేదని విమర్శించారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లపై చర్చకు సిద్ధమా అని పైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఏ ప్రాజెక్ట్‌ నుంచి నీరు ఎక్కడికి ప్రవహిస్తుందో తెలియని నాయకులు నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:02 PM