పులి గోర్ల కలకలం..
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:19 PM
ఆత్మకూరు ప్రాంతంలో బుధవారం పులి గోర్లు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది.
అటవీ అధికారుల అదుపులో ఓ టీడీపీ నాయకుడు?
ఆత్మకూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాంతంలో బుధవారం పులి గోర్లు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఈవిషయాన్ని అటవీ అధికారులు నిర్థారిం చినప్పటికీ పూర్తివివరాలను వెల్లడించడం జాప్యం వహిస్తున్నారు. విలేకరులు అటవీ డివిజన కార్యాలయానికి వెళ్లి ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్‌అప్పావ్ వివరణ కోరగా ఇందుకు స్పందించిన ఆయన తమకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఓ వ్యక్తి వద్ద సోదాలు చేయగా ఆయన తన బైక్‌లో బ్యాగ్‌లో ఆరు పులి గోర్లను ఉం చుకున్నట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పులిగోర్ల స్వాధీన ఘటనపై విచారణ చేస్తున్నారని పూర్తి సమాచారం రాగానే వివరాలు వెల్లడి స్తామని స్పష్టంచేశారు. పట్టుబడిన వ్యక్తి వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచారు. ఇదిలావుంటే పట్టుబడిన వ్యక్తి ఆత్మకూరుకి చెందిన ఓ టీడీపీ నాయకుడు అని తెలిసింది. అతడు బుధవారం ఉదయం 11గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై బయటకెళ్లాడు. అదే సమయంలో అటవీ శాఖాధికారులు దాడులు చేపట్టగా ఆయన బైకు సంచిలో ఆరు పులి గోర్లు లభ్యమైనట్లు సమాచారం. అతన్ని ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. దీంతో అతని బంధువులతో పాటు పలువురు టీడీపీ నాయ కులు కూడా అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పులిగోర్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడించే అవకాశం ఉంది.