‘ఉక్కు’ కష్టాలకు త్వరలో ముగింపు: శ్రీనివాసవర్మ
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:31 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కష్టాలను అధిగమించి త్వరలో గాడిన పడుతుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
విశాఖపట్నం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కష్టాలను అధిగమించి త్వరలో గాడిన పడుతుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన సీఐఎస్‌ఎఫ్ రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు. పలు శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్, కూటమి ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం తన పాలసీని పక్కనపెట్టి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఆర్థిక సాయం చేసిందన్నారు. దానివల్ల పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయన్నారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీపడడం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 4వ తేదీన కేంద్ర ఉక్కు కార్యదర్శి స్టీల్‌ప్లాంటు సందర్శనకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ ఐజీ శరవణన్ తదితరులు పాల్గొన్నారు.