Share News

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:16 AM

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని సీఐ యుగంధర్‌ హెచ్చరించారు.

 మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

సీఐ యుగంధర్‌

వెల్దుర్తిలో ఆపరేషన ‘వజ్రప్రహార్‌ ’

ఆరు వాహనాలు సీజ్‌

ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

వెల్దుర్తి, మే 16(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని సీఐ యుగంధర్‌ హెచ్చరించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘వజ్రప్రహార్‌’ లో భాగంగా శనివారం ఉదయం వెల్దుర్తిలో ‘మెగా కార్డనసెర్చ్‌’ నిర్వహించారు. అనుమానిత ఇళ్లు, లాడ్జీ, ఖాళీ భవనాలు, బస్టాండు, అనుమానాస్పద ప్రదేశాలు, గంజాయి, నార్కోటిక్‌ ముద్దాయిల ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. 51 వాహనాలను తనిఖీ చేయగా అందులో సరైన పత్రాలు లేని ఆరు వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. వెల్దుర్తికి చెందిన బోయ కృష్ణ , బోయ కుంతి నాగన్నల నుంచి 42 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నే రాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన స మాచారం ఉంటే ‘ ఏపీ ఈగల్‌ ’ టోల్‌ ఫ్రీ నెంబరు ‘ 1972 ’ కు స మాచారం అందించాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పోలీసు అధికారులు ప్రజలతో కలిసి ‘ఆపరేషన వజ్రప్రహార్‌ ’ ప్రతిజ్ఞ చేయించారు. తనిఖీల్లో వెల్దుర్తి, క్రిష్ణగిరి ఎస్‌ఐలు నరేశ, క్రిష్ణమూర్తి, పోలీసు సిబ్బంది, స్పెషల్‌ టీమ్‌లు పాల్గొన్నారు.

కుప్పగల్‌ గ్రామంలో ....

ఆదోని రూరల్‌ : కుప్పగల్‌లో తాలుకా సీఐ నల్లప్ప, ఎస్‌ఐ విద్యాశ్రీ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున కార్డనసెర్చ్‌ నిర్వహించారు. ఆదోని వనటౌన, టూటౌన, త్రీటౌన, పీసీఆర్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో అనుమానితుల నివాసాలను తనిఖీ చేశారు. ఓ మహిళ ఇంట్లో ఉన్న 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులకు, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌, మాదకద్రవ్యాల నిందితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - May 17 , 2026 | 12:16 AM