మహిళల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
ఫిర్యాదుల కోసం 9 నుంచి 13 వరకు ‘జన్ సున్వాయి’ ప్రత్యేక డ్రైవ్
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 9 నుంచి 13 వరకు ఐదు రోజుల పాటు ‘జన్ సున్వాయి’ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాలను ఐదు జోన్లుగా విభజించి.. మార్చి 9న నెల్లూరు, 10న గుంటూరు, 11న విజయవాడ, 12న రాజమండ్రి, 13న విశాఖపట్నం జోన్లలోని జిల్లా హెడ్‌క్వార్టర్లలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గృహహింస తదితర అన్యాయాలకు గురైన మహిళలు ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు. కాగా, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రూపొందించిన మహిళా రక్షణ పోస్టర్‌ను మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో రాయపాటి శైలజ ఆవిష్కరించారు.