AP State Government: ‘ఎ’ కేటగిరి కింద 3 కార్పొరేషన్లు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:12 AM
రాష్ట్రంలోని కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, బోర్డులకు సంబంధించి ప్రభుత్వం కేటగిరీలను నిర్ణయించింది.
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, బోర్డులకు సంబంధించి ప్రభుత్వం కేటగిరీలను నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ అధికారిక భాషా కమిషనర్, ఉర్దూ అకాడమీలను కేటగిరి ఎ కేటగిరీ కింద ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే పల్నాడు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ, రెడ్డిక వెల్ఫేర్ కార్పొరేషన్, కుర్ని వెల్ఫేర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, ఏపీ భట్రాజ్ వెల్ఫేర్, ఏపీ స్టేట్ పేరికా వెల్ఫేర్ కార్పొరేషను బి కేటగిరీ కింద ఉంటాయని పేర్కొంది.