Share News

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:17 AM

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన 23వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల...

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

  • ఇంధన, ఐటీ, పర్యాటక రంగాలకు మహర్దశ.. రూ.25 వేల కోట్లు.. 1.21లక్షల ఉద్యోగాలు

  • పారిశ్రామిక, వాణిజ్య ప్రతిపాదనలకు ఆమోదం.. సీఎస్‌ అధ్యక్షతన 23వ ఎస్‌ఐపీసీ సమావేశం

  • ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక మంత్రి మండలిలోనూ ఆమోదం

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన 23వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం జరిగింది. ఇందులో రూ.25,272.18 కోట్ల పెట్టుబడుల ద్వారా 1,21,331 మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక, వాణిజ్య ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలకు.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక.. మంత్రి మండలిలోనూ ఆమోదం పొందనున్నాయి.


ఇంధన రంగంలో రూ.12,652 కోట్ల పెట్టుబడులు

ఇంధన రంగంలో రూ.12,652 కోట్ల పెట్టుబడులు, 69,070 ఉద్యోగ కల్పనా ప్రతిపాదనలకు ఆమోదం దక్కింది. క్లీన్‌ ఎనర్జీ, రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ సిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1391 కోట్లతో 160 మందికి ఉద్యోగాలను కల్పించే 150 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టును స్థాపిస్తామని ప్రతిపాదించింది. ఇదే సంస్థ.. రూ.1391 కోట్లతో 190 మందికి ఉద్యోగాలు కల్పించే మరో 150 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఎస్సార్‌ రెన్యువబుల్స్‌ హైబ్రిడ్‌ వన్‌ లిమిటెడ్‌ ఒప్పందం మేరకు రూ.1327 కోట్లతో 1035 మందికి ఉద్యోగాలు కల్పించే 300/420మెగావాట్ల డీసీ సోలార్‌ 2పవర్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇదే సంస్థ రూ.2714 కోట్లతో 1240 మందికి ఉద్యోగాలను కల్పించే 300/522 మెగావాట్‌ డీసీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పేస్‌ డిజిటల్స్‌ రూ.745 కోట్లతో 345 మందికి ఉద్యోగాలను కల్పించే 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌తో 100 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు ప్రతిపాదనకు ఎస్‌ఐపీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సాఎల్‌(ఎ్‌సఏఈఎల్‌) ఇండస్ట్రీస్‌ రూ.3200 కోట్లతో 65,000 మందికి ఉద్యోగాలను కల్పించే 200 మెగావాట్ల బయోమాస్‌ పవర్‌ ప్లాంట్‌కు, హెచ్‌హెచ్‌పీ ఎయిట్‌ (హైజెన్కో) రూ.70 కోట్లతో 850 మందికి ఉద్యోగాలను కల్పించే ఒక కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌కు ఎస్‌ఐపీసీ ఆమోదించింది.


ఐటీ రంగంలో రూ.7343.68 కోట్ల పెట్టుబడులు

విశాఖలో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ రూ.750 కోట్లతో 7000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. క్రెడెన్స్‌ రియల్లీ రూ.386.88 కోట్లతో 6,500మందికి, ఫెయూజీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ రూ.425 కోట్లతో 2500 మందికి, పీజీ టెక్నోప్లాస్ట్‌ రూ.1305 కోట్లతో 2810 మందికి ఉద్యోగాలను కల్పించేలా ఎలకా్ట్రనిక్స్‌ పరికరాల ఉత్పత్తి ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదించింది. ఎన్‌పీఎ్‌సపీఎల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ రూ.2500 కోట్లతో 400మంది ఉద్యోగాలు ఇచ్చే ఎలకా్ట్రనిక్స్‌ విడిభాగాల తయారీ పరిశ్రమకు ఆమోదించింది. శ్రీటెక్‌ డేటా లిమిటెడ్‌ రూ.1800 కోట్లతో విశాఖ డేటా ల్యాండింగ్‌ కేబుల్‌ ఏర్పాటు చేయనుంది. క్వాంటమ్‌ ఏఐ గ్లోబల్‌ రూ.108 కోట్లతో 1552 మందికి, సన్‌రే గ్రీన్‌ స్పేస్‌ రూ.117.66 కోట్లతో 160 మందికి, రవిప్రియ హాస్పిటాలిటీస్‌ రూ.82.49 కోట్లతో 120మందికి, రుషికొండ బీచ్‌ రిసార్ట్స్‌ రూ.52.07 కోట్ల పెట్టుడితో 70 మందికి, వైజయంతి హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.51.55 కోట్లతో 130మందికి, ఓర్వకల్లులో పీపీపీ విధానంలో బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు రూ.574 కోట్లతో నిర్మించి 25000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మెట్రో డెవలపర్స్‌ రూ.1032కోట్ల పెట్టుబడితో 400 మందికి, ఏఎంఎన్‌ఎ్‌సఐ రూ.1400 కోట్లతో 250 మందికి, ఎర్లీ బర్డ్‌ (1) కింద రూ.633 కోట్లతో 117మందికి, బాల్‌ బేవరేజెస్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.633 కోట్లతో 117 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకూ గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇంధన ఎనర్జీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దరఖాస్తును ఎస్‌ఐపీసీ ఆమోదించింది.

Updated Date - Mar 29 , 2026 | 04:18 AM