అంతరిక్ష రంగంలో స్టార్ట్‌పల విప్లవం రావాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:56 AM
అంతరిక్ష రంగంలో స్టార్ట్‌పల విప్లవం రావాలని హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎ్‌ససీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ తెలిపారు.
హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఎ్‌ససీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ప్రారంభమైన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ 2026
గుంటూరు(విద్య), జనవరి 22(ఆంధ్రజ్యోతి): అంతరిక్ష రంగంలో స్టార్ట్‌పల విప్లవం రావాలని హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎ్‌ససీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో గురువారం ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ(అమరావతి), అనంత్ టెక్నాలజీస్(హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్-2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2040 నాటికి ప్రపంచ అంతరిక్ష ఉత్పత్తిలో భారత్ వాటా 10 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రవేశించే యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. విజ్ఞాన్స్ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన ఉన్న చోట ఆ దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక నానుడిని గుర్తు చేస్తూ, స్పేస్ టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాకుండా, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మారిందన్నారు. అనంత్ టెక్నాలజీస్ సీఎండీ, విజ్ఞాన్స్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతికత ప్రతి సామాన్యుడికి చేరాలని సూచించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులే సొంతంగా శాటిలైట్‌ను తయారు చేసి ప్రయోగించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.శేషగిరిరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలపై లభించే వనరులను కూడా భవిష్యత్తులో వినియోగించుకోవచ్చని.. అలా చేస్తే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.