Share News

అన్న క్యాంటీన్‌కు స్టార్‌ హోటల్స్‌ 50 లక్షల విరాళం

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:24 AM

రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ రూ. 50 లక్షల విరాళం ఇచ్చింది.

అన్న క్యాంటీన్‌కు స్టార్‌ హోటల్స్‌ 50 లక్షల విరాళం

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ రూ. 50 లక్షల విరాళం ఇచ్చింది. అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు. సీఎంను కలిసినవారిలో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి, ఉపాధ్యక్షుడు పవన్‌ కార్తీక్‌, కార్యదర్శి సి.మూర్తి, తాజ్‌ వివంత హోటల్‌ చైర్మన్‌ మలినేని రాజయ్య, మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌ చైర్మన్‌ ముత్తవరపు మురళీకృష్ణ, జీఆర్టీ హోటల్స్‌ అఽధినేత వి.శరణ్‌ ఉన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 06:25 AM