Share News

పవన్‌ కల్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:07 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఫీక్‌ అహ్మద్‌ను చిలకలపూడి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.

పవన్‌ కల్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు

  • స్టాండప్‌ కమెడియన్‌ రఫీక్‌ అహ్మద్‌ అరెస్ట్‌, విడుదల

మచిలీపట్నం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఫీక్‌ అహ్మద్‌ను చిలకలపూడి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. స్టాండప్‌ కమెడియన్‌గా పనిచేస్తున్న రఫీక్‌ 2023, 2024 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన రెండు షోలలో పవన్‌కల్యాణ్‌పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాలో వాటిని అప్‌లోడ్‌ చేశాడు. మచిలీపట్నానికి చెంది న జనసేన కార్యకర్తలు శాయన శివయ్య, మోకా రవి.. చిలకలపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విశాఖలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 04:07 AM