Share News

స్టాండప్‌ కమెడియన్‌ అనుదీప్‌ విడుదల

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:44 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన అన్న కుమార్తె నిహారికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్‌ కమెడియన్‌ అనుదీప్‌ కటికాలను కాకినాడ పోలీసులు గురువారం..

స్టాండప్‌ కమెడియన్‌ అనుదీప్‌ విడుదల

కాకినాడ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన అన్న కుమార్తె నిహారికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్‌ కమెడియన్‌ అనుదీప్‌ కటికాలను కాకినాడ పోలీసులు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి బి.శ్రీదేవి ముందు హాజరుపరిచారు. రాత్రి 12 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ‘ఈ వ్యాఖ్యలు మీకు మీరుగా చేశారా? లేక ఎవరైనా మీపై ఒత్తిడి చేశారా’ అని అనుదీప్‌ను న్యాయాధికారి ప్రశ్నించారు. రూ.10 వేల పూచీకత్తుతో అనుదీప్‌ను విడుదల చేస్తున్నట్లు న్యాయాధికారి ప్రకటించారు.

Updated Date - Apr 17 , 2026 | 05:44 AM