Share News

వెదురు బొంగులతో చెట్లపై గుడిసె.. దానిలోనే బస!

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:15 AM

మార్కాపురం జిల్లా.. ఎర్రగొండపాలెం మండల కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉండే చెంచుగూడెం అది. ఊరి పేరు పాలుట్ల. 300 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో ఎక్కువ మంది చెంచులు కాగా...

వెదురు బొంగులతో చెట్లపై గుడిసె.. దానిలోనే బస!

  • గిరిజన గూడెంలో ఎస్టీ కమిషన్‌ పర్యటన

మార్కాపురం జిల్లా.. ఎర్రగొండపాలెం మండల కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉండే చెంచుగూడెం అది. ఊరి పేరు పాలుట్ల. 300 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో ఎక్కువ మంది చెంచులు కాగా, కొద్దిమంది సుగాలీలు ఉన్నారు. మండలానికి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. కారు, జీపుల్లో అక్కడికి వెళ్లాలంటే ఐదారు గంటల పైనే పడుతుంది. దట్టమైన అడవి మార్గంలో వెళ్లాల్సి రావడమే ఇందుకు కారణం. అలాంటి ఈ గిరిజన గూడెంలో శనివారం రాత్రి ఒకటే సందడి. పదుల సంఖ్యలో కార్లు, జీపులు.. అధికార యంత్రాంగం... ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల రాకతో అంతా ఒకటే హడావుడి. మూడు రోజులుగా మార్కాపురంలో జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డి, కమిషన్‌ సభ్యులు.. శనివారం రాత్రి పాలుట్ల గ్రామానికి వచ్చారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని మాటిచ్చారు. అంతేకాదు.. వెదురుబొంగులు తెచ్చి, చెట్లపై చిన్నపాటి గుడిసె వేసుకుని.. రాత్రికి అందులోనే నిద్రించి.. గిరిజనుల గత జీవిత విధానాన్ని గుర్తుకు తెచ్చారు.

- ఆంధ్రజ్యోతి, ఎర్రగొండపాలెం రూరల్‌

Updated Date - Apr 27 , 2026 | 06:17 AM