Share News

అటెంప్ట్‌ చేసి ఉంటేనే మార్కులు!

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:08 AM

పదో తరగతి హిందీ, ఇంగ్లిష్‌ పరీక్షల్లో పొరపాటుగా వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులకు వరుసగా 2, 4 చొప్పున మార్కులు కలపాలని ఎస్‌ఎ్‌ససీ బోర్డు నిర్ణయించింది.

అటెంప్ట్‌ చేసి ఉంటేనే మార్కులు!

టెన్త్‌ హిందీ, ఇంగ్లిష్‌ పరీక్షల్లో పొరపాటు ప్రశ్నలకు మార్కులు యాడింగ్‌

2, 4 చొప్పున కలపాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): పదో తరగతి హిందీ, ఇంగ్లిష్‌ పరీక్షల్లో పొరపాటుగా వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులకు వరుసగా 2, 4 చొప్పున మార్కులు కలపాలని ఎస్‌ఎ్‌ససీ బోర్డు నిర్ణయించింది. ఇంగ్లీష్ లోనాలుగు మార్కుల వ్యతిరేక పదాలకు సంబంధించిన 28వ ప్రశ్నకు మార్కులు కలపనుంది. పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్‌ బుక్‌ నుంచి ప్రశ్న వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే హిందీలో ఒక మార్కు 3, 6 ప్రశ్నలకు ‘కే’ బదులుగా ‘క’ పడినందున అక్కడ కూడా మార్కులు కలపనుంది. అయితే విద్యార్థులు ఏదొక సమాధానాలు రాసి ఉంటేనే (అటెంప్ట్‌ చేస్తేనే) మార్కులు ఇస్తారు.

Updated Date - Apr 05 , 2026 | 05:09 AM