14న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బీటెక్ సీట్ల కేటాయింపు
ABN , Publish Date - May 12 , 2026 | 05:13 AM
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 14న సీట్ల కేటాయింపు జరుగుతుందని సంస్థ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.శివశంకర్ తెలిపారు.
10 నుంచి రెండో దశ జేఈఈ: అడ్మిషన్స్ డైరెక్టర్
విజయవాడ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 14న సీట్ల కేటాయింపు జరుగుతుందని సంస్థ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.శివశంకర్ తెలిపారు. మొదటి దశ కింద.. ప్రవేశ పరీక్ష (ఎస్‌ఆర్‌ఎం జేఈఈ)కు హాజరైన విద్యార్థులు తమకు అవసరమైన ప్రోగ్రామ్‌లను ఈ నెల 10 వరకు ఎంపిక చేసుకున్నారని, ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించి 14న సమాచారం అందజేస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, జూన్ 10 నుంచి 15 వరకు రెండోదశ ప్రవేశ పరీక్ష జరుగుతుందని, జూన్ 4 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఈ ఏడాది నుంచి బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ ఇంజనీరింగ్, డిఫెన్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. 10వ తరగతిలో 60 శాతం, ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులు పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీకాంతో పాటు ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని శివశంకర్ వివరించారు. అడ్మిషన్ల కోసం నేరుగా మంగళగిరి సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో లేదా 08069888999 నంబరులో సంప్రదించాలని సూచించారు.