కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:54 AM
ఆలయ ప్రధానవీధిలో విహరిస్తున్న స్వామిఅమ్మవార్లు
మహాదుర్గగా భ్రమరాంబిక
-నేడు ప్రభోత్సవం...నందివాహన సేవ
-మహా సరస్వతి అలంకారంలో శ్రీశైల భ్రామరి
శ్రీశైలం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి ఉత్సమూర్తులను కైలాసవాహనంపై ఊరేగించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరోదైన భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గా అలంకరణలో భక్తులను కరుణించింది. అష్టభుజాలు కలిగిన ఈదేవి పద్మం, చక్రం, త్రిశూలం, ఖడ్గం ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీ మేళం, కొమ్ముకోయ నృత్యం మొదలైనవి భక్తులను ఆకట్టుకున్నాయి.
నేటి కార్యక్రమాలు
ఉగాది మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం సాయంత్రం ప్రభోత్సవం, మహాసరస్వతిగా భ్రమరాంబ దేవి దర్శనమివ్వగా నందివాహనసేవలో స్వామి, అమ్మవార్లు భక్తులను కరుణించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.