శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:27 AM
శ్రీశైలం జలాశయంలో వారం క్రితం వరకు రెండు పోటీపడి విద్యుదుత్పత్తి చేయడంతో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాలు...
వారంలోగా డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వ
వచ్చే మూడు నెలలు తీవ్ర నీటి ఎద్దడి
బ్రహ్మగిరి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం జలాశయంలో వారం క్రితం వరకు రెండు పోటీపడి విద్యుదుత్పత్తి చేయడంతో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాలు కలిసి 50 టీఎంసీలపైగా నీటి ని వాడేశాయి. శ్రీశైలం డ్యాం నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.2720 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నీటి మట్టం 885 అడుగులు కాగా.. శనివారం 823.30 అడుగులకు చేరింది. రానున్న వారం రోజుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజికి పడిపోడం ఖాయమని ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. డ్యాంలోకి జూన్ తర్వాతే వరద వచ్చే పరిస్థితి ఉంటుందని, మరో మూడు నెలలు తీవ్ర నీటి ఎద్దడి తప్పదని పేర్కొంటున్నారు. కృష్ణా జలాలు అడుగంటడంతో నల్లమల అటవీ ప్రాతంలోని జంతువులకు సైతం నీటి ఎద్దడి తప్పని పరిస్థితి నెలకొందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.