Share News

శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:01 AM

శ్రీశైలం జలాశయంలో నీరు క్రమంగా పెరుగుతోంది. ఎగువన జూరాల ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 45,800 క్యూసెక్కులు నీరు విడుదలై, శనివారం సాయంత్రానికి..

శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక

శ్రీశైలం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీరు క్రమంగా పెరుగుతోంది. ఎగువన జూరాల ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 45,800 క్యూసెక్కులు నీరు విడుదలై, శనివారం సాయంత్రానికి 50,161 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 167.4860 టీఎంసీలు నమోదయ్యాయి. కుడి గట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయగా.. ఎడమ గట్టున జల విద్యుత్‌ కేంద్రంలో 28,252 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Aug 23 , 2026 | 05:02 AM