Share News

ప్లంజ్‌పూల్‌తో ప్రస్తుతానికి ప్రమాదం లేదు

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:41 AM

ప్లంజ్‌పూల్‌ వల్ల శ్రీశైల జలాశయానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదమూ లేదని సెంట్రల్‌ డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్‌ (సీడీఎస్ఈ) చైర్మన్‌, డ్యాం నిపుణుడు డీకే శర్మ వెల్లడించారు.

ప్లంజ్‌పూల్‌తో ప్రస్తుతానికి ప్రమాదం లేదు

  • రెండో రోజూ శ్రీశైలం డ్యాంను పరిశీలించిన సీడీఎస్ఈ బృందం

శ్రీశైలం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్లంజ్‌పూల్‌ వల్ల శ్రీశైల జలాశయానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదమూ లేదని సెంట్రల్‌ డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్‌ (సీడీఎస్ఈ) చైర్మన్‌, డ్యాం నిపుణుడు డీకే శర్మ వెల్లడించారు. అయితే ప్లంజ్‌పూల్‌ పెరగకుండా ముందుజాగ్రత్తగా రెండువైపులా గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో ఢిల్లీ నుంచి బుధవారం వచ్చిన నిపుణుల బృందం గురువారం రెండోరోజూ శ్రీశైల జలాశయం భద్రత, కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ బృందంలో డ్యాం నిపుణుడు టీకే శివరాజన్‌, హైడ్రో మెకానికల్‌ నిపుణుడు గుల్షన్‌రాజ్‌, జియాలజీ నిపుణుడు జేఎం గౌతమ్‌ కూడా ఉన్నారు. గ్యాలరీ, క్రస్ట్‌గేట్లు తదితరాలను పరిశీలించిన బృందం.. మార్పు, చేర్పులు, కొద్దిపాటి మరమ్మతులపై ఇరిగేషన్‌ అధికారులకు సూచనలు చేసింది.

Updated Date - Apr 03 , 2026 | 05:41 AM