Share News

శ్రీశైలానికి స్వల్పంగా పెరిగి..తగ్గిన ప్రవాహం

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:32 AM

ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టడంతో దిగువకు చాలా తక్కువ నీరు విడుదలవుతోంది.

శ్రీశైలానికి స్వల్పంగా పెరిగి..తగ్గిన ప్రవాహం

అమరావతి/శ్రీశైలం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టడంతో దిగువకు చాలా తక్కువ నీరు విడుదలవుతోంది. అయితే జూరాల, శ్రీశైలం మధ్య స్థానికంగా కురిసిన వర్షాలతో గురువారం ఉదయం శ్రీశైలం డ్యాంలోకి 84,181 క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రానికి 19,535 క్యూసెక్కులకు పడిపోయింది. ఎగువన జూరాల నుంచి కూడా ప్రవాహం ఆగిపోయిం ది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రంలో ఏపీ అధికారులు ఉదయం 7,437 క్యూ౅ సక్కులు వినియోగించి విద్యుదుత్పత్తి చేసి తర్వాత ఆపేశారు. తెలంగాణ మాత్రం ఎడ మ గట్టు కేంద్రంలో 40 వేల క్యూసెక్కులతో విద్యుదుత్పాదన చేస్తూ దిగువకు విడుదల చేస్తోంది. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, మల్యాల, కల్వకుర్తి పథకాలకు 15,333 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో జలాశయంలో నీటి నిల్వలు 183.84 టీఎంసీలకు తగ్గిపోయాయి. జూరాల నుంచి దిగువకు నీటి విడుదల ఆపేశారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 52,967 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌లో ప్రస్తుతం 152.94 టీఎంసీలున్నాయి. పులిచింతల ప్రాజెక్టులో 28.63 టీఎంసీల నీరు ఉంది.

17న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను ఎవరికెన్ని కేటాయించాలో ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటారు.

Updated Date - Aug 14 , 2026 | 05:34 AM