Share News

మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకారం

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:06 AM

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా కాకుమాను శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు నగరం చుట్టుగుంటలోని...

మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకారం

గుంటూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా కాకుమాను శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు నగరం చుట్టుగుంటలోని మార్కెటింగ్‌ కమిషనరేట్‌లో ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రథమ డైరెక్టర్‌గా ఛార్జ్‌ తీసుకొన్నారు. ఇప్పటివరకు ఈ పోస్టును కమిషనర్‌ నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ చట్టంలో సవరణలు చేసి డైరెక్టర్‌ పోస్టు మంజూరు చేసింది. రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లలో సీనియర్‌ అయిన శ్రీనివాసరావును ఆ పోస్టులోకి నియమించింది. ఈ ఏడాది డిసెంబరు వరకు ఆయన డైరెక్టర్‌ హోదాలో కొనసాగుతారు.

Updated Date - Feb 27 , 2026 | 03:07 AM