రావణ్, శ్రవణ్‌లు హిందూత్వంపై విషం కక్కుతున్నారు
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:41 AM
హిందూత్వం, సనాతన ధర్మం గురించి ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ ఇష్టానుసారం మాట్లాడుతూ విషం కక్కుతున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు
ప్రకాశ్ రాజ్ పనికిమాలిన వ్యక్తి
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి
డాబాగార్డెన్స్(విశాఖపట్నం), జూలై 7(ఆంధ్రజ్యోతి): హిందూత్వం, సనాతన ధర్మం గురించి ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ ఇష్టానుసారం మాట్లాడుతూ విషం కక్కుతున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు. తప్పులు చేస్తున్నవారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తుంటే, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని వైసీపీ నాయకులు ఖండించాల్సింది పోయి వారికి మద్దతు పలకడం దారుణం. వైసీపీ అధినేత జగన్ హిందువులకు ఇచ్చే గౌరవం ఇదేనా? సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటి? సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఒక పనికిమాలిన వ్యక్తి. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.’ అని శ్రీనివాసానంద అన్నారు.