శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.76 కోట్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:47 PM
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.2,76,62,955 వచ్చినట్లు మఠం అధికారులు వెల్లడించారు.
మంత్రాలయం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.2,76,62,955 వచ్చినట్లు మఠం అధికారులు వెల్లడించారు. గడిచిన 19 రోజులకు సంబంధించి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం మఠంలోని గురురాజాంగణ భవనంలో లెక్కింపు చేపట్టారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేశ కోణాపూర్, శ్రీపతి ఆచార్, దేవదాయ శాఖ అధికారి కమలాకర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు నిర్వహించరు. హుండీలో నగదుతో పాటు 680 గ్రాముల వెండి, 49 గ్రాముల బంగారు, వివిధ దేశాల కరెన్సీ సమకూరినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమచేసినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాధాచార్, పాల్గొన్నారు.