Share News

రాష్ట్రపతి భవన్‌లో కలంకారీ గ్యాలరీ

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:04 AM

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో కలంకారీ గ్యాలరీ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి పేరొందిన 21 మంది కళాకారులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కళాకారులు గీసిన కలంకారీ చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత విశ్వనాథరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 06:07 AM