హమ్మయ్య.. ఈగల బెడద తప్పింది!
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:52 AM
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం పంచాయతీలోని బాలకవానిపేట గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈగలు ఎట్టకేలకు..
ఇళ్లకు చేరుకుంటున్న బాలకవానిపేట గ్రామస్థులు
టెక్కలి రూరల్, జూలై 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం పంచాయతీలోని బాలకవానిపేట గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈగలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. వారు పడుతున్న ఇక్కట్లపై ‘ఊరంతా ఈగల మోత’ అన్న శీర్షికన ఈనెల 11న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి ఆ రోజు నుంచే గ్రామంలో ఈగల నివారణ మందు పిచికారీ చేయించారు. దీనికితోడు రెండు రోజుల నుంచి ఎండలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈగల మోత తగ్గడంతో బంధువుల ఊర్లకు వెళ్లిన వారు సోమవారం నుంచి గ్రామానికి చేరుకుంటున్నారు.