ఎస్వీబీసీ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:49 AM
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ శనివారం బాధ్యతలను స్వీకరించారు.
తిరుపతి సిటీ, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ శనివారం బాధ్యతలను స్వీకరించారు. తిరుపతిలోని అలిపిరి వద్దగల ఛానల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీబీసీలో ఉత్తమమైన కార్యక్రమాల రూపకల్పనకు, ఛానల్ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. ఆధునిక సాంకేతికతతో ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి వైభవాన్ని నలుదిశలా ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.