Share News

రామతీర్థం ముస్తాబు

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:16 AM

విజయనగరం జిల్లా రామతీర్థం శుక్రవారం జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. వేకువజామున 3 గంటలకు ఆలయంలోని సీతారామ సమేత లక్ష్మణ...

రామతీర్థం ముస్తాబు

  • పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా రామతీర్థం శుక్రవారం జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. వేకువజామున 3 గంటలకు ఆలయంలోని సీతారామ సమేత లక్ష్మణ, హనుమ విగ్రహాలకు పంచామృతాభిషేకాలు నిర్వహించి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 8 గంటలకు సీతారామ ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదిక వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య తీసుకుని వస్తారు. 10 గంటలకు సీతారాముల కల్యాణ క్రతువు మొదలవుతుంది. 11 గంటలకు సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అందజేస్తారు.

Updated Date - Mar 27 , 2026 | 05:16 AM