స్క్వాడ్ టీం ఎఫ్‌ఎస్‌వో అనిల్‌కుమార్ మృతి
ABN , Publish Date - May 08 , 2026 | 11:46 PM
ఆత్మకూరు అటవీ డివిజన ఏపీ ఫారెస్ట్ జూని యర్ ఆఫీసర్స్ అసోసియేషన అధ్యక్షుడు అనిల్‌కుమార్(40) శుక్రవారం అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.
ఆత్మకూరు, మే 8(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు అటవీ డివిజన ఏపీ ఫారెస్ట్ జూని యర్ ఆఫీసర్స్ అసోసియేషన అధ్యక్షుడు అనిల్‌కుమార్(40) శుక్రవారం అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ప్రస్తుతం ఫారెస్ట్ స్వ్కాడ్ టీంలో ఎఫ్‌ఎస్‌వోగా పని చేస్తున్న అనిల్‌కుమార్ పది రోజుల క్రితం కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడు తూ కర్నూలు, హైదరబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారు. ఈక్ర మంలోనే కోలుకోలేక శుక్రవారం కన్నుమూశారు. మృతదేహాన్ని ఆత్మకూరులోని ఆ యన స్వగృహాన్ని తీసుకురావడంతో సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్, పలువురు అటవీశాఖ అధికారులు, రాజకీ య నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అనిల్‌కుమార్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈయన మృతి తీరని లోటని పలువురు అటవీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.