చదువుతోపాటు క్రీడలు ముఖ్యం
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:53 PM
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు.
డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏపీ పీఈటీఎస్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన అసోసియేషన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మునిసిపల్ క్రీడామైదానంలో ధ్యాన చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్, తాలూకా క్రికెట్ అసోసియేషన అధ్యక్షుడు విట్టా రమేష్, పెద్దకడబూరు ఎంఈవో రామ్మూర్తి, రిటైర్డ్ ఎంఈవో భూపాల్ రెడ్డి , వెటర్న్ క్రీడాకారుడు బందే నవాజ్ ఖాజా, హరితా కుమారి, న్యాయవాది జీవన సింగ్ క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. మునిసిపల్ మెయిన రోడ్డు మీదుగా శ్రీనివాస్ భవన భీమా సర్కిల్ వరకు సాగింది. మునిసిపల్ క్రీడామైదానంలో ధ్యాన చంద్ క్రీడా పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వక్తలు మాట్లాడుతూ మేజర్ ధ్యానచంద్ దేశానికి అందించిన క్రీడా సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో శేక్షావలి, భాస్కర్, మునిసిపల్ హైస్కూల్ హెచఎం సుధాకర్ బాబు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఖలీల్ అహ్మద్, నరసింహరాజు, నరసింహులు, రామన్న, వెంకటేష్, ఈరన్న, ఓబన్న, కళ్యాణ్ రావు, జగన్నాథ్ రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.