Share News

శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:16 AM

విద్యార్ధులు, యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగా లంటే క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారఽథి అన్నారు.

 శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం
కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి

అట్టహాసంగా అమరావతి చాంపియన షిప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి) : విద్యార్ధులు, యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగా లంటే క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారఽథి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి స్పోర్ట్స్‌ చాంపి యన షిప్‌- 2026 నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. ఆర్స్ట్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ముఖ్య అ తిథులుగా ఎమ్మె ల్యే, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అ య్య ప్ప హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. వారితో కలిసి ఉత్సాహం గా కబడీ,్డ పరుగుపందెంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నిం పారు. ఆయన మాట్లాడు తూ విజయాన్ని లక్ష్యంగా కా కుండా క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఇలాంటి క్రీడా పోటీలు యు వతలో ఆత్మవిశ్వాసాన్ని నా యకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌బాబు, క్రీడాపోటీల కో ఆర్డినేటర్‌ నరసింహులు, అథ్లెంటిక్‌ కోచ కాశీ రావు, వ్యా యామ ఉపాధ్యాయులు ఖలీల్‌ అహ్మద్‌, రామన్న, నరసింహులు, కళ్యాణ్‌రావు, ఓబన్న, రమేష్‌, చిన్న బసప్ప, జగన్నాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 12:16 AM