Share News

Employee Appreciation: సచివాలయంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది నిజాయితీ

ABN , Publish Date - Jan 02 , 2026 | 06:02 AM

మహిళా ఉద్యోగి పోగొట్టుకున్న బంగారం గొలుసును తిరిగి ఆమెకు అప్పగించి అమరావతి సచివాలయ భద్రతా సిబ్బంది ప్రశంసలు అందుకున్నారు.

Employee Appreciation: సచివాలయంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది నిజాయితీ

  • పోగొట్టుకున్న బంగారం గొలుసు మహిళా అధికారికి అప్పగింత

అమరావతి, జనవరి 1(ఆంధ్రజోతి): మహిళా ఉద్యోగి పోగొట్టుకున్న బంగారం గొలుసును తిరిగి ఆమెకు అప్పగించి అమరావతి సచివాలయ భద్రతా సిబ్బంది ప్రశంసలు అందుకున్నారు. రెవెన్యూశాఖలో సెక్షన్‌ అధికారి(ఎ్‌సవో)గా విధులు నిర్వహిస్తున్న పద్మ గురువారం ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో సచివాలయం గేటు-2 వద్ద ఆమె బంగారు గొలుసు కింద పడిపోయింది. ఆ సమయంలో ఆ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జనార్దన్‌రావు ఆ గొలుసును సచివాలయ చీఫ్‌ సెక్యురిటీ అధికారి మల్లికార్జునకు అప్పగించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు ఆ గొలుసును ఎస్‌వో పద్మకు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన జనార్థనరావును, ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉద్యోగులు ప్రశంసించారు.

Updated Date - Jan 02 , 2026 | 06:02 AM