Share News

శ్రీశైలం డ్యామ్‌ భద్రతా సిబ్బందిపై తేనెటీగల దాడి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:46 AM

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తిన ఓ ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

శ్రీశైలం డ్యామ్‌ భద్రతా సిబ్బందిపై తేనెటీగల దాడి

  • తప్పించుకునే క్రమంలో గుండెపోటుతో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

శ్రీశైలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తిన ఓ ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన పిల్లి వీరస్వామి(52) నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంపై ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా మూడేళ్లుగా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం విధులలోకి వచ్చి తోటి కానిస్టేబుల్‌ నర్సింహతో కలిసి గ్యాలరీ లిఫ్ట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. దీంతో కానిస్టేబుళ్లిద్దరూ చెరోవైపు పరుగెత్తారు. కొంత దూరం పరుగెత్తిన వీరస్వామి డ్యాంపైనే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. కంట్రోల్‌ రూం నుంచి గమనించిన మిగతా సిబ్బంది వీరస్వామిని, నర్సింహను సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వీరస్వామి గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తేనెటీగల దాడిలో గాయపడిన మరో కానిస్టేబుల్‌ నర్సింహ చికిత్స పొదుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 03:46 AM